-
-
By Chowdary
Updated :
08 December 2025 04:14 PM
కాకినాడ నగరం వీధుల్లో ఇష్టం సారంగా పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలి వేయడంతో పారిశుధ్య నిర్వహణకు ప్రజలకు వాహనముల చోదకులకు రాకపోకలకు తీవ్ర అవరోధంతో పాటు ప్రమాదాలు జరుగున్నా దృష్ట్యా, పశువుల యాజమానులు తమకు సంబందించిన పశువులను రోడ్లపై సంచరించకుండా చర్యలు తీసుకువాలని వివరించిన పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జ్ కమిషనర్ సత్యనారాయణ శనివారం వెల్లడించారు. దీనివలన వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులు పట్టించుకోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంచార్జ్.కమీషనర్ ఎన్. వి.వి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ షణ్ముఖ్ సాగిలి ఆదేశాల ప్రకారం కాకినాడ నగర పరిధిలోని పలు వీధులలో రోడ్ల పై పశువులు సంచరించడం వలన ప్రజలకు వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగించుచున్నందున మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమము చేపట్టి పలు వీధులలో రోడ్ల పై సంచరిస్తున్న 15 ఆవులను, పశువులను సిబ్బంది ద్వారా గోసాలకు(బందుల దొడ్డి) నకు తరలించుట జరిగిందని చెప్పారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆవులు వలన ఒక వాహనదారుడు ఆసుపత్రి పాలై కాలు విరిగిపోయిందని హాస్పిటల్ తీసుకువెళ్లగా సుమారు రెండు లక్షల రూపాయలు ఆపరేషన్ కి ఖర్చయిందని అన్నారు. ఇప్పటికైనా పశువుల యజమానులు నగరపాలక సంస్థ వారికీ తగిన ఆధారాలను చూపి, అపరాధ రుసుము చెల్లించి, అఫిడవిట్ సమర్పించి పశువులను తీసుకోని మీ స్వంత స్థలములో ఉంచుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేయటమైనదన్నారు. నిర్ధేశించిన గడువు లోపల పశువులను తీసుకోని వెళ్ళనిచో నగరపాలక సంస్థ వారు తగు చట్ట పరమైన చర్యలు తీసుకోనబడునని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృద్వి చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎస్ ఎస్ రాంబాబు, ధర్మరాజు, అడపా సత్యనారాయణ, వై దుర్గారావు, రెడ్డి, తదితరులు పాల్గొన్నారు