-
-
By Chowdary
Updated :
20 November 2025 06:27 PM
సోషల్ మీడియాలో ట్రెండ్, వైరల్ కావడం ఎవరికి ఇష్టం ఉండదు. కొద్దిరోజులుగా నా ఫొటోలూ, వీడియోల్ని షేర్చేయడం, కామెంట్ చేయడం, నా గురించి నెట్లో వెతకడం... ఎక్కువైంది. మీరు చూపుతున్న ఈ ఆదరాభిమానాలకు థాంక్స్. ఎందరో ప్రశంసిస్తూ మెసేజ్లు, డీఎమ్లు పెడుతున్నారు. నామీద ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. దీనివల్ల నా సినిమాలూ, వెబ్ సిరీస్లకు వీక్షకులు పెరుగుతుండటం నటిగా సంతోషాన్ని కలిగించే విషయమే. దీంట్లో మరో కోణమూ ఉంది. కొందరు హద్దులుమీరి తుంటరి పనులు చేస్తున్నారు. నా ఫొటోల్ని ఏఐతో మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి అశ్లీలతను జోడించి షేర్ చేస్తున్నారు. దీనివల్ల నాకు భయం, దిగులు ఎక్కువయ్యాయి. నాకు 12 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. వాడు ఇప్పుడు సోషల్ మీడియాలో లేడు కానీ, ఏదో ఒకరోజు వస్తాడుగా. ఈ మార్ఫింగ్ ఫొటోల్ని చూస్తే తన పరిస్థితి ఏంటి? తల్లి ఫొటోల్ని అలా చూసి ఎలా స్పందిస్తాడోనని ఆందోళన కలుగుతోంది. అది మార్ఫింగ్ ఫొటో అని వాడికి ఎలా తెలుస్తుంది? తెలిసినా ఇలా జరిగినందుకు ఎంత బాధపడతాడు. మీరు ఇలాంటి ఫొటోలు చూస్తూ, షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతోంటే... అశ్లీలతను ప్రోత్సహిస్తున్నట్లే! కొందరు ఫేక్ అకౌంట్లు పెట్టి నేను విరాళాలు అడుగుతున్నట్టు మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. మీరు నిజంగా నా నటనను ఇష్టపడేవారైతే థియేటర్లో కలుద్దాం!